Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
కార్మికులహక్కుల కోసం నిరంతరం ఉద్యమాలు చేసిన పెంటయ్య కార్మిక వర్గ పక్షపాతి అని పెంటయ్య, ఆశయ సాధన కోసం కార్మికులు సంఘటిత ఉద్యమాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు.బుధవారం సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్మిక నేత పెంటయ్య ప్రథమ వర్థంతి సభ సీఐటీయూ జిల్లా అధ్యక్షులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన రంగారెడ్డి మాట్లాడుతూ సీఐటీయూ జెండా పట్టుకొని కార్మికులందరిని కూడగట్టి అనేక సంఘాలు పెట్టి సీఐటీయూను బలోపేతం చేయడంలో పెంటయ్య కీలక పాత్ర పోషించారన్నారు.కార్మికులకు యజమానులకు మధ్య కూలి రేట్ల పెంపు కోసం జరిగే చర్చల్లో కార్మికుల పక్షాన నిలబడి వేతనాలు పెంచారన్నారు. పట్టణంలో ఒక హమాలి కార్మికుడిగా తన జీవితాన్ని ప్రారంభించి తను అనుభవించిన కష్టాలు మరొకరికి రాకూడదని సీఐటీయూ ఆధ్వర్యంలో హమాలీల సమస్యలపై రాజీ లేని పోరాటాలు నిర్వహించారన్నారు.పట్టణంలోని మున్సిపల్, మిల్లు, పెయింటర్స్, ఆశా, అంగన్వాడీ, మార్కెట్ హమాలీ,దడ్వాయి, డబ్బా కూలీల లాంటి కార్మికుల సమస్యల కోసం నిరంతరం శ్రమించేవారన్నారు.ఒక పక్క కార్మికుల సమస్యలపై పోరాడుతూనే మరోపక్క పేద ప్రజల కష్టజీవుల రాజ్యం రావాలని తినడానికి తిండి అందరికీ దొరకాలని, సమసమాజ స్థాపన కోసం ఎర్రజెండా నాయకత్వంలో పనిచేశారన్నారు.సూర్యాపేట పట్టణంలోని పేదల ఇండ్లు,స్థలాలు, రేషన్ కార్డులు,పెన్షన్ల కోసం పార్టీ పట్టణ కార్యదర్శిగా ఉండి అనేక ఉద్యమాలు నిర్వహించారన్నారు.ఈ కార్యక్రమంలో రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ ఉప్పల లలితా దేవిఆనంద్,సీఐటీయూ జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి ముక్రం, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ చెరుకు యాకలక్ష్మి, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు రవినాయక్, కల్లు కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎలుగూరి గోవిందు,కెేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి,పీిఎన్ఎం జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న,ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ధనియాకుల శ్రీకాంత్, సీఐటీయూ జిల్లా నాయకులు మేకనబోయిన శేఖర్,మిట్టగడుపుల ముత్యాలు,రణపంగ కష్ణ,బచ్చలకురి స్వరాజ్యం, గుంటి వెంకటేశ్వర్లు, హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కాటయ్య, పెయింటర్స్యూనియన్ నాయకులు మార్క్,లింగయ్య, దడువాయి యూనియన్ నాయకులు భూపతిశంభులింగం, మార్కెట్ హమాలీ నాయకులు చంద్రయ్య,దస్రు, స్వీపర్, డబ్బా యూనియన్ నాయకులు విజయమ్మ, శారద, పద్మ పాల్గొన్నారు.