Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చిట్యాల
అర్హులైన ప్రతి దళిత కుటుంబానికీ దళిత బంధు ఇవ్వాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితబంధు ఇవ్వాలని కోరుతూ ఆ సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గానికి ఐదు వేల మంది లబ్దిదారులకు దళిత బంధు వర్తింపజేయాలని కోరారు.ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి దళితులను దగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్ ప్లాన్ నిధుల ద్వారా ప్రతి కుటుంబానికీి పది లక్షలు రూపాయలు ఇవ్వడం పెద్ద సమస్య కాదన్నారు . ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జిట్ట నగేష్ మాట్లాడుతూ మూడేండ్లుగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాలకు నేటికీ సబ్సిడీ లు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూమి ఎక్కడ అమలు కాలేదన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం జాడేలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే దళితులకు ఇస్తామన్న హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బారీ ప్రదర్శనగా వెళ్లి చిట్యాల తహసీల్దార్ క్రిష్ణా రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల నాయకులు మందుగుల యాదయ్య, ఈసం రాజు, పంది నరేష్, వివిధ ప్రజా సంఘాల నాయకులు కత్తుల లింగస్వామి, జిట్ట సరోజ, స్వామి, మాస శ్రీనివాసు, చంద్రగిరి రవికుమార్, దుర్గేష్, వడ్డేపల్లి శంకర్మే, సుగుణమ్మ, సిరిఫంగి లక్ష్మిమ్మ, అండాలు, లక్ష్మయ్య, రత్నం యాదయ్య, హెచ్చు మారమ్మ, సుమతి, కళ్యాణి, వలిగొండ జంగయ్య, పొలిమేర ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.