Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చండూరు
మున్సిపాలిటీ అభివద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చైర్ పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న కోరారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 20 నుండి జూన్ 6 వరకు వరకు నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమం గురించి చర్చించారు. మున్సిపాలిటీ పరిధిలో అభివద్ధి పనుల గురించి తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ , వెంకట్ రామ్, కౌన్సిల్ సభ్యులు మంచుకొండ కీర్తి సంజరు , అన్నేపర్తి శేఖర్, కొండ్రెడ్డి యాదయ్య, గుంటి వెంకటేశం కో ఆప్షన్ సభ్యులు సంకోజు దుర్గమ్మ , మేనేజర్ ప్రభాకర్ , రామచంద్రం ,రమేష్ పాల్గొన్నారు.