Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తడిసి రంగు వారిన ధాన్యంలో కోత విధించొద్దు
- రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి
నవతెలంగాణ- రామన్నపేట
ఎలాంటి కోతలు విదించ కుండ దాన్యం కొనుగోలును వేగవంతం చేసి, 48గంటల్లో రైతు ఖాతాల్లో ధాన్యం డబ్బులు వేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) గ్రామ శాఖ, రైతు సంఘం ఆద్వర్యంలో బుధవారం మండలంలోని సిరిపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరీశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియని వేగవంతం చేయడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. ధాన్యపు రాసులు పోసి నెల రోజులు గడుస్తున్నా మండల వ్యాపంగా తూకాల ప్రక్రియ మందకోడిగా సాగుతుందని విమర్శించారు. వర్ష సూచనలతో రైతులు భయాందోళనకు గురవుతున్నారన్నారు. గన్నీ బ్యాగుల కొరతను నివారించి, ప్రతి రోజు రెండు లారీలు క్రమం తప్పకుండా కొనుగోలు కేంద్రాలకు పంపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యంపిటిసి బడుగు రమేష్, నాయకులు అంబటి సురేందర్ రెడ్డి, దోమలపల్లి నర్సింహ్మ, దాడి మల్లారెడ్డి, జంగుల సామిరెడ్డి, ఎళ్ళ యాదిరెడ్డి, బల్గూరి నర్సింహ్మ, సిలువేరు వెంకటయ్య ,తదితరులు పాల్గొన్నారు.