Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్యదర్శుల విధులపై ఆగ్రహం వ్యక్తం చేసిన జెడ్పీటీసీ
- నవతెలంగాణలో కథనం అంశంను లేవనెత్తిన సర్పంచ్
నవతెలంగాణ -మునుగోడు
మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారంతో పాటు అభివద్ధి ప్రణాళికలపై ప్రతి మూడు నెలలకోసారీ నిర్వహించుకునే మండల సర్వసభ్య సమావేశం ఇలాంటి తీర్మానాలు లేకుండానే మొక్కుబడిగా సాగింది. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో సమావేశంలో పశుసంవర్ధక శాఖ , ఆరోగ్యశాఖ , బీసీ బాలుర హాస్టల్ , ఉపాధి హామీ , శిశు సంక్షేమ శాఖ , హార్టికల్చర్ , ఎక్సైజ్ శాఖ , వైద్యశాఖ అధికారులు తమ నివేదికలను చదివి వినిపించగా మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ గైర్హాజర్ కావడంతో మండల విస్తరణ అధికారి ఎం.నరసింహ గౌడ్ నివేదికను సమావేశలో ప్రవేశపెడుతున్నడంతో ఎల్గాల గుడెం సర్పంచ్ సురిగి చలపతి కలగజేసుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో హమాలి చార్జీలలోనే ధాన్యం పోసిన భూమి చార్జీల పేరుతో పాటు సెంటర్లో పనిచేసే ఇన్చార్జికి ఇవ్వాలని సాకుతో రైతుల నుండి అదనంగా బస్తా కు రెండు నుండి మూడు రూపాయలు తేమ శాతం పేరుతో 2 వేలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయం తమ దష్టికి రాలేదని కొనుగోలు కేంద్రాల్లో ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా పర్యవేక్షణ చేపడతామని వివరణ ఇచ్చారు. విద్యుత్ ఏఈ వరప్రసాద్ విద్యుత్ శాఖ ఎజెండాను ప్రసంగిస్తుండగా ఈనెల 16న నవ తెలంగాణ లో ప్రచురితమైన 'ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్' ఈ పథకం అమలులో ఉందా ..? అమలులో ఉంటే ఎస్సీ ఎస్టీ ల నుండి వేలకు వేలు బిల్లులు ఎందుకు వసూలు చేస్తున్నారని నిలదీశారు. నూట ఒక్క యూనిట్ ఉచిత విద్యుత్ అమల్లోనే ఉందని నూట ఒక్క యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీలు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు . మిషన్ భగీరథ , మిషన్ భగీరథ ఎంట్రా ఏఈ లు మణిదీప్ , అజరు కుమార్ వేసవి కాలంలో నీటి సమస్య లేకుండా సిబ్బందితో ఎప్పటికప్పుడు మండలంలోని ప్రతి గ్రామానికి నీటిని అందిస్తున్నామని అనడంతో మునుగోడు సర్పంచ్ మిర్యాల వెంకన్న తమ గ్రామపంచాయతీ పరిధిలోని పలు వార్డుల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని సంబంధిత అధికారుల దష్టికి తీసుకెళ్లినప్పటికీ నీటి సమస్య పరిష్కారం కాలేదని సభ దష్టికి తీసుకువచ్చారు. రావిగూడెం సర్పంచ్ గుర్రం సత్యం తమ గ్రామ పంచాయతీ పరిధిలోని కార్మిక నగర్‌కు వెళ్లే పైప్ లైన్ చిట్యాల రోడ్డు విస్తీర్ణంలో పైపులు పగిలి పోవడంతో ఆ కాలనీ ప్రజలు మిషన్ భగీరథ నీటిని కి తాగ నోచుకోలేక పోతున్నారని వాపోయారు. ఈ విషయంపై డిఈఈ దష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మునుగోడు జెడ్పీటీసీ నారబోయిన స్వరూపరాణి రవి ముదిరాజ్ మాట్లాడుతూ గ్రామాలలో విధులు నిర్వహించే కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాల్సిన బాధ్యతను మరిచి ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు పోతున్నారు తెలియని పరిస్థితి దాపురించిందన్నారు. మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు తమ దష్టికి తీసుకువచ్చారని విధులు నిర్వహిస్తున్న కార్యదర్శిలపై పర్యవేక్షణ లోపంతోనే తమ ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. తదనంతరం ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్ మాట్లాడుతూ ఆర్ అండ్‌బీ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులకు సంబంధిత మండల ఆర్ అండ్‌బీ ఏఈ శిరీష కుమార్ మండలంలో వేలకోట్ల తో పనులు ప్రారంభిస్తున్న ప్రజాప్రతినిధులను ఆహ్వానం చేయకుండా పనులను ప్రారంభిస్తూ ప్రజా ప్రతినిధులను అవమాన పరిచే విధంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బి యాకూబ్ నాయక్ , తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు , వైస్ ఎంపీపీ అనంత వీణ స్వామి గౌడ్ , ఎంపీటీసీలు , సర్పంచులు , వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.