Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నకిరేకల్
నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేస్తున్న అభివద్ధిని చూసి ఓర్వలేక ఒక వర్గం రాజకీయంగా దాడులు చేస్తుందని జెడ్పీటీసీ మాద ధనలక్ష్మి నగేష్ గౌడ్, మున్సిపల్ చైర్మెన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ నకిరేకల్ మండలంలోని వల్లభాపురం గ్రామం, కేతేపల్లి మండలం లోని తుంగతుర్తి గ్రామంలో రాజకీయంగా ఓర్వలేక వ్యక్తిగతంగా కొంతమంది చిరుమర్తి వర్గంపై దాడులకు దిగడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. గ్రామాలలో దాడులకు దిగిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నకిరేకల్, కేతేపల్లి మండల అధ్యక్షులు పగడపు నవీన్ రావు, మారం వెంకట్ రెడ్డి, నాయకులు నోముల కేశవరాజు, నడికుడి వెంకటేశ్వర్లు, కొప్పుల ప్రదీప్ రెడ్డి, మురారి శెట్టి కష్ణమూర్తి, వై. సైదా రెడ్డి, బానోతు వెంకన్న, కొండ శ్రీను, చెవుగొని శంకర్, పోతుల రవి పాల్గొన్నారు.