Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
మండలపరిదిలోని అన్నారం గ్రామానికి చెందిన యువకుడు సారెడ్డి క్రాంతికిరణ్‌రెడ్డి (25) ఈనెల 7 వ తేదిన అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.కాగా పార్థివ దేహం మంగళవారం రాత్రి స్వగ్రామం అన్నారంకు చేరుకుంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి అన్నారంలోని కిరణ్ రెడ్డి నివాసానికి వేర్వేరుగా చేరుకొని వారి పార్థివదేహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.జూలకంటి రంగారెడ్డి అంతిమయాత్రలో పాల్గొని పాడే మోశారు.వారి వెంట మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహరెడ్డి, ఎంపీపీ నూకల సరళ-హనుమంత్‌రెడ్డి, డీసీఎంఎస్ వైస్‌చైర్మెన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ధనవాత్ చిట్టిబాబునాయక్, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, రవినాయక్, పీఏసీఎస్ చైర్మెన్ అంబటి వెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పులిజగదీష్, మాజీ ఎంపీపీ ఒగ్గు జానయ్య, సర్పంచ్ అంబటి వీరారెడ్డి, రవీందర్‌నాయక్, కాంగ్రెస్ నాయకులు వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.