Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంస్థాన్‌నారాయణపురం:మండలకేంద్రంలోని నడి చౌరస్తాలో నిర్వహిస్తున్న ప్రభుత్వ ఆయుర్వేేద ఆస్పత్రిని వేరేచోటుకు మార్చాలనే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని పలువురు వద్దులు కోరుతున్నారు.ఈ మేరకు కలెక్టర్, ఆస్పత్రి డై రెక్టర్, మంత్రి హరీశ్‌రావుకు విన్నవించారు.చౌరస్తాలో ఉండటం వల్ల అనేక మంది నడవలేని వద్దులు వైద్యం కోసం రిక్షాల్లో వచ్చి బీపీ, షుగర్, సుఖ విరేచనాలు,కాళ్ళ నొప్పులు,చేవి, కంటిలో చుక్కల మందు వేయించుకుంటున్నామని పలువురు వద్దులు అంటున్నారు.వద్ధుల సంక్షేమాన్ని దష్టిలో ఉంచుకుని లక్షల రూపాయల విలువ చేసే భవనాన్ని దాత మోహన్‌రావు విరాళంగా ఇస్తే సక్రమంగా వినియోగించుకోవాల్సిన ఆ శాఖ అధికారులు సక్రమంగా పనిచేయని కొంత సిబ్బంది చెప్పుడు మాటలు విని ఈ ఆస్పరతిని పలక్‌నుమా గుట్ట కింద గల ప్రభుత్వాస్పత్రి వద్దకు మార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు.చౌరస్తకు దూరంగ గల ప్రభుత్వాస్పత్రి వద్దకు మార్చినట్టైతే వద్దులు వైద్యం కోసం అక్కడికి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.విరాళంగా ఇచ్చిన భవన దాత తిరిగి ఇచ్చిన భవనాన్ని తీసుకునే ప్రమాదం ఉందన్నారు.ఇప్పటికైనా సంబంధిత జిల్లాస్థాయి అధికారులు స్పందించి చౌరస్తాలోనే ఆయుర్వేద ఆస్పత్రి కొనసాగేవిధంగా చూడాలని పలువురు వద్ధులు కోరుతున్నారు.
చౌరస్తాలోనే కొనసాగించాలి
వద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పాశం ధర్మయ్య
ఆయుర్వేద ఆస్పత్రిని చౌరస్తాలోనే కొనసాగించాలి.వృద్ధులకు ఇక్కడే అందుబాటులో వుంది.ఇక్కడి నుండి కిలోమీటర్ దూరంలో ఉన్న పలక్‌నుమా గుట్టకు మార్చినట్టయితే పోలేక వైద్యానికి నోచుకోరు.ఇబ్బందులు పడుతారు.ఆస్పత్రిని వేరేచోటకు మార్చొద్దని కలెక్టర్, డైరెక్టర్‌కు, మంత్రి హరీష్‌రావుకు విన్నవించాం.