Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
మినీ అంగన్వాడీ టీచర్ల రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి కార్మిక దినోత్సవం రోజు శ్రమశక్తి అవార్డు అందుకున్న సందర్భంగా ఆదివారం నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తన కార్యాలయంలో శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. మినీ అంగన్వాడీ టీచర్ల సమస్యల పరిష్కారంలో ముందుంటూ వారికి అనేక సేవలు చేసిన వరలక్ష్మికి తగిన గుర్తింపు రావడం సంతోషదగ్గ విషయం అని అన్నారు. ఆడెపు వరలక్ష్మి మాట్లాడుతూ ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా వుంది అని, అందరి సహాయ సహకారాలతోనే ముందుకు వెళ్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్, నల్గొండ పట్టణ అధ్యక్షులు పిల్లి రామరాజు, రావుల శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ గుడిసె ఇందిరా, జిల్లా కమిటీ సభ్యులు సుహాసిని, చంద్రకళ, అనిత, సబిత, అనూష, నాగేంద్ర, అనిత, రాములమ్మ, అండాలు, మినీ అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.