Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
నవ తెలంగాణ-డిండి
దొంతినేని నరసింహారావు ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి కృషి చేస్తానని అని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.ఆదివారం డిండి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.5లక్షలతో చేపడుతున్న పహారి గోడ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....నియోజకవర్గంలోని ప్రభుత్వ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.ప్రభుత్వ విద్యాలయాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు.పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది అని ఆయన గుర్తు చేశారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. రాజకీయాలకు అతీతంగా కళాశాలలను అభివృద్ధి చేయడం జరిగింది అని ఆయన తెలిపారు. పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం దేవరకొండ నియోజకవర్గ కేంద్రంలో గిరిజన డిగ్రీ గురుకుల కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు.మండలం ఎర్రరాం గ్రామంలో రూ.24.58లక్షలతో, గొనబోయినపల్లి గ్రామంలో రూ.12.85లక్షలతో, జెత్య తండాలో రూ.7.39లక్షలతో, గోనకొల్లు గ్రామంలో రూ.10.11లక్షలతో గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలల్లో పలు అభివద్ధి పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శాసనసభ్యులు రవీంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాధవరం సునీతాజనార్దన్ రావు,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పేర్వాల జంగా రెడ్డి,రైతు బంధు అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వర్ రావు,పిఎసిఎస్ చైర్మన్ మాధవరం శ్రీనివాస్ రావు, పంచాయతీ రాజ్ డీఈ లింగా రెడ్డి, స్థానిక సర్పంచ్ మేకల సాయమ్మకాశన్న, మాధవరం జనార్దన్ రావు, మల్ రెడ్డి విష్ణు వర్ధన్ రెడ్డి, గొడుగు వెంకటయ్య, రాఘవ చారి, రమావత్ వెంకట్రామ్, యం.ఎ.ఖలీం, గిరమోని శ్రీను, బొడ్డుపల్లి కష్ణ, శ్రీనివాస్ గౌడ్, వెంకటయ్య, గుర్రం సురేష్, ప్రిన్సిపాల్ నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.