Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్పల్లి
అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న..రెండేండ్ల వయస్సున్న కొడుకు ఉరేసి తల్లీ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలపరిధిలోని అవురవాణిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.ఎస్ఐ బొడిగె రామకష్ణ తెలిపినవివరాల ప్రకారం...అవురవాణి గ్రామానికి చెందిన దొడ్డి నరే ష్తో మూడేండ్ల కింద హైదరాబాద్కు చెందిన లాస్యతో వివాహ మైంది.నరేష్ రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు.లాస్యకు రెండేండ్ల వయస్సు ఉన్న కొడుకు స్వాతిక్ ఉన్నాడు.ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరులేని చూసి మొదట లాస్య కొడుకుకు చీరతో ఉరి పెట్టి అదే చీరతో తాను ఉరేసుకుంది. ప్రస్తుతం భర్త చదువుల కోసం హైదరాబాద్లో ఉన్నాడు.ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.