Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్
నవతెలంగాణ-కోదాడరూరల్
విధినిర్వహణలో డీఎస్పీ రఘు సేవలు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆదివారం పట్టణంలోని గునుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్లో తొర్రురుకు బదిలీ అయిన డి ఎస్పీ రఘు ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత రెండున్నర సంవత్సరాలుగా కోదాడ డివిజన్ లో శాంతి భద్రతల పరిరక్షణలో రఘు విశేషంగా కృషి చేశారన్నారు. నేరాల పరిశోధనలో ఆయన సమర్థవంతంగా పనిచేస్తూ డివిజన్లోని సీఐ, ఎస్ఐలకు మార్గదర్శకం చేశారన్నారు. డివిజన్లో సీఐలను ఎస్ఐలను సిబ్బందిని సమన్వయం చేసి శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేశారని సేవలను కొనియాడారు. అంకితభావంతో పనిచేసే ఉద్యోగులకు అన్నిచోట్ల ఆదరణ ఉంటుంది అన్నారు. అనంతరం రఘును శాలువా పూలమాలలతో సన్మానించారు. అనంతరం డీిఎస్పీ రఘు మాట్లాడుతూ సీఐలు, ఎస్ఐలు కేసు పరిశోధనలో నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. న్యాయపరమైన అంశాలను నిత్యం అధ్యయనం చేయాలని సూచించారు. తనపై అభిమానంతో ఆత్మీయ వీడ్కోలు సన్మానం నిర్వహించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐలు, ఎస్ఐలు సిబ్బంది ఘనంగా సన్మానించారు. డీఎస్పి మోహన్ కుమార్, కోదాడ పట్టణ సీఐ నరసింహారావు, సీఐ ప్రసాద్, సూర్యాపేట ఎస్బీ సీిఐ శ్రీనివాస్, సూర్యాపేట సీఐలు ఆంజనేయులు , విట్టల్ రెడ్డి, తుంగతుర్తి సీఐ నాగార్జున గౌడ్, నాగారం సీిఐ రాజేష్, మునగాల సీఐ ఆంజనేయులు, రామలింగారెడ్డి, డాక్టర్ శ్రీపతి రెడ్డి పాల్గొన్నారు.