Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
క్రీస్తు పూర్వం 3400 సంవత్సరాల క్రితం భారత దేశంలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన యుద్ధ కళ కరాటే అని , కరాటే నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు అన్ని రంగాల్లో ఉన్నతంగా రాణిస్తారని నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు . ఆదివారం స్థానిక రాంనగర్ పార్కులో కరాటే బెల్టు గ్రేడింగ్ టెస్టు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరాటే నేర్చుకోవడం ద్వారా విద్యార్థులకు క్రమశిక్షణ , ఆత్మస్థైర్యం , ఆరోగ్యంతో పాటుగా చదువులో రాణిస్తు , జీవన నైపున్యాలు పెంపొందించుకొని సకల కళలలోనూ రాణిస్తారని అన్నారు . విద్యార్థులు నైతిక విలువలతో కూడిన విద్యార్థులుగా ఎదగడం ద్వారా అభ్యుదయ కర సమాజాన్ని నిర్మించగలమన్నారు . చిన్నతనం నుండే విద్యార్థులు కరాటే , ఇతర ఆటలు ఆడటం ద్వారా మానసికంగా పరిపక్వత చెందుతారన్నారు. ఆ విద్యార్థులే అన్ని రంగాల్లో వికసిస్తారని తెలిపారు. వివిధ కోచింగులు ఇస్తున్న ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రాన్ని అభినందించారు. ఈ కేంద్రం గతంలో గ్రూప్ -2 , ఎస్ఐ , కానిస్టేబుల్ కోచింగ్ ఇచ్చి సలహాలు , సూచనలు చేసినారని గుర్తు చేశారు . అలాగే తాను గత రెండు సంవత్సరాలుగా షటిల్ బ్యాట్మెంటన్ పోటీలను ప్రారంభించే అవకాశం ఇచ్చిందన్నారు. ఎంవీఎన్ ట్రస్టు చేస్తున్న సేవలను ప్రజలందరూ ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ట్రస్ట్ కార్యనిర్వహణ కార్యదర్శి పి.నర్సిరెడ్డి మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా ఉచిత కరాటే శిక్షణను రెగ్యూలర్‌గా నిర్వహిస్తున్నామని ఇక్కడ నేర్చుకున్న విద్యార్థులు జాతీయ , రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించారని అన్నారు . దీనిని మరింత విస్తరించేందుకు ఎక్కువ మంది విద్యార్థులకు ఉచితంగా కరాటే శిక్షణను ఇప్పిస్తామన్నారు . ఉచితంగా నిర్వహిస్తున్న పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు గ్రంధాలయం , స్టడీ హాలును ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు . జపాన్ కరాటే అసోసియేషన్ దక్షిణ భారత రాష్ట్రాల చీఫ్ ఎగ్జామినర్ సెన్సాయి ఆర్ సుదర్శన్ మాస్టర్ మాట్లాడుతూ కరాటే ఒలింపిక్, స్పోర్ట్స్ అథరిటీలో భాగం అయినందున విద్యార్థులకు ఉపయోగకరంగా ఉటుందని అన్నారు . కావున తల్లిదండ్రులందరు తమ పిల్లలను కరాటే శిక్షణకు పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సఖి కేంద్రం కోఆర్డినేటర్ ఎం .సునిత , విజ్ఞాన కేంద్రం బాధ్యులు పి.యాదగిరి, మాస్టర్లు నాగారాజు, కె.నగేష్, సాగర్, పవన్ కళ్యాణ్, నిఖిల్, శ్రీకాంత్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. కరాటే పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు వివిధ స్థాయిల బెల్ట్‌లు అందజేశారు.