Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగార్జున సాగర్
జూన్ 1వ తేదీన నాగార్జునసాగర్ విజయ విహార్ అతిథిగృహంలో ట్రస్మా జిల్లా కార్యవర్గం ప్రమాణ స్వీకార మహౌత్సవం నిర్వహించనున్నట్లు ట్రస్మా(తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్) గౌరవ అధ్యక్షులు యానాల ప్రభాకర్ రెడ్డి ఆదివారం తెలిపారు. అనంతరం హిల్ కాలనీ రెడ్డి ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే నోముల భగత్‌ను శాలువాతో సన్మానించారు. అనంతరం ట్రస్మా జిల్లా కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆ తర్వాత విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈనెల 17వ తేదీన మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో ఎన్నుకున్న ట్రస్మా జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహౌత్సవ కార్యక్రమాన్ని విజయ విహార్ అతిథిగృహంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి అతిథిగా స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు కందాల పాప రెడ్డిలు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్ లందరూ హాజరుకావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ట్రస్మా నాయకులు షేక్ అబ్బాస్, రఘు ,సురేష్ లు ఉన్నారు.