Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్యాక్టరీ గేటు ముందు రైతుల నిరసన
నవతెలంగాణ-మిర్యాలగూడ
మా భూములు మాకు ఇవ్వాలంటూ మండలంలోని జప్తివీరప్పగూడెంలో ఫ్యాక్టరీకి భూములు అమ్మిన రైతులు ఫ్యాక్టరీ గేటు ముందు ఆదివారం నిరసన చేపట్టారు. భూములలో పెరిగిన చేట్లను తొలగించి తమ భూములను చదును చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఫ్యాక్టరీ కట్టి ఉపాధి కల్పిసామని చెప్పి పేద రైతుల భూములు కాడా తక్కువ ధరకుకొని ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాశి సిమెంట్స్ (కోరోమండల్ షుగర్ కం లిమిటెడ్లి ) గత పదిహేను ఏళ్ల క్రితం ఎకరం ,రెండు ఎకరాలు ఉన్న పేద రైతుల కాడ అతి తక్కువ రేట్లకు ఫ్యాక్టరీ యాజమాన్యం మాయ మాటలు చెప్పి , ఫ్యాక్టరీ నిర్మాణము చేస్తామని, పొలాలు అమ్మిన రైతు కుటుంబాలకు ఉపాధి కల్పిసామని చెప్పి అమలు చేయలేదదన్నారు. ఫ్యాక్టరీ అమ్మకానికి పెట్టిన భూములను ఆరోజు చెల్లించిన ధరకు న్యాయ న్యాయపరమైన బ్యాంకు వడ్డీ చెల్లిచ్చి తమ భూములు తాము తీసుకుంటామని, ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామని ఫ్యాక్టరీ యజమాన్యాన్ని రైతుల హెచ్చరించారు. రైతుల పక్షాన పోరాటం చేసేందుకు సీపీఐ(ఎం) ముందుంటుందని ఆ పార్టీ నాయకులు తెలిపారు.