Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 43 ప్రభుత్వ, 17 ప్రయివేట్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
- పరీక్ష రాయనున్న 9488 మంది విద్యార్థులు
- పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
- జిల్లా విద్యాశాఖ అధికారి నర్సింహ
నవతెలంగాణ-భువనగిరిరూరల్
జిల్లాలో పదవ తరగతి పరీక్షలు నేటి నుండి జూన్ 1 తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు వరకు నిర్వహించనున్నట్టు డీఈఓ నర్సింహ ఆదివారం తెలిపారు.పదవ తరగతి పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో మొత్తం 60 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.వీటిలో 43 ప్రభుత్వ పాఠశాలలు, 17 ప్రయివేట్ పాఠశాలలు పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.పరీక్షలకు సుమారుగా 9,487 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు.భువనగిరి మండలంలో 10 పరీక్షా కేంద్రాలు, వలిగొండలో 3, రామన్నపేటలో 3, బొమ్మలరామారంలో 3, రాజాపేట 3, తుర్కపల్లిలో 3, బీబీనగర్ 4, మోత్కూరులో 3 , అడ్డగూడూరులో 1, భూదాన్ పోచంపల్లిలో 4, యాదగిరి గుట్టలో 3, మోట కొండూరులో 2, ఆత్మకూర్ఎంలో 1,ఆలేరులో 4, చౌటుప్పల్‌లో 8, నారాయణ పురంలో 3, గుండాల మండల ంలో 2 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యా ర్థులకు అందుబాటులో ఓఆర్ఎస్ ప్యాకె ట్లు అందుబాటులో ఉంటా యన్నారు. ప్రాథమిక చికిత్సకు అవసరమయ్యే మెడికల్ కిట్లతో అందుబాటులో ఉంటాయని తెలిపారు.ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఐదు నిమిషాల నిబంధన అమలులో ఉంటుందన్నారు. విద్యార్థులు పరీక్ష ప్రారంభమగుటకు ఒక గంట ముందుగానే హాల్ టికెట్‌తో పరీక్షాకేంద్రాల వద్ద ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని కోరారు. పదో తరగతి విద్యార్థులు అందరూ పరీక్షాకేంద్రానికి సరైన సమయంలో చేరుకోవాలని కోరారు.జిల్లా వ్యాప్తంగా 17 మండలాలలోని 60 పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.విద్యార్థులు ఎవరు తప్పిదాలకు పాల్పడకుండా సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించనునట్లు తెలిపారు.ఎలక్ట్రానిక్ వస్తువులు వెంట తీసుకురావొద్దన్నారు.పరీక్షకు హాజరగు విద్యార్థులు ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్‌ఫోన్, కాలిక్యులేటర్ తీసుకొని రాకూడదని తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షాకేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.పరిసర ప్రాంతంలోని జీరాక్స్ సెంటర్లు పరీక్ష నిర్వహించే సమయంలో మూసి వేయాలన్నారు.