Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కపల్లి
రైతుసంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమని పీసీసీ మాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు, నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య అన్నారు.ఆదివారం మండలంలోని దత్తాయపల్లి ,ఇబ్రహీంపూర్, కోనాపూర్,ఎంజీ బండల్, వీరారెడ్డిపల్లి గ్రామాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. జెండా ఎగురవేసి గడప గడప తిరుగుతూ ప్రతి ఇంటికి ఇంటికి రైతు డిక్లరేషన్ పత్రాలను పంపిణీ చేశారు.బీర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్‌ను ఎంజీబండల్ గ్రామంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల రైతు వ్యతిరేక నిర్ణయాలతో మోసపోతున్న తెలంగాణ రైతులకు ఒక భరోసానిస్తూ రైతు సంఘర్షణ వేదికగా రాహుల్‌గాంధీ నాయకత్వంలో జరిగిన రైతు డిక్లరేషన్ పెట్టడం జరిగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ,కౌలు రైతులకు ఎకరానికి 15 వేల పెట్టుబడి సాయం అందిస్తామన్నారు.భూమిలేని ఉపాధిహామీ రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థికసాయం చేస్తామన్నారు.అన్ని పంటలకు గిట్టుబాటు ధర పెట్టి కొంటామని, పోడు, అసైన్డ్ భూముల రైతులకు పట్టాలు ఇప్పిస్తామన్నారు.ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని,కాంగ్రెస్ ఎల్లవేళలా రైతులకు అండగా ఉంటుందని, అధైర్యపడొద్దన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ధనావత్ శంకర్ నాయక్, డీసీసీ ప్రధాన కార్యదర్శి గుడిపాటి మధుసూదన్‌రెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షులు ధనావత్ భాస్కర్‌నాయక్,వీరారెడ్డిపల్లి ఎంపీటీసీ కానుగంటి శ్రీనివాస్‌యాదవ్, మండలప్రధాన కార్యదర్శి చాడ భాస్కర్‌రెడ్డి, బీసీసెల్ జిల్లా కార్యదర్శి డొంకెనవెంకటేష్, మండల ఉపాధ్యక్షులు భూక్యా రాజారామ్నాయక్, బొత్తా రాములు,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు పట్టునాయక్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రఘు, మైనారిటీ సెల్ అసద్ బేగ్, మండల నాయకులు బానోత్ వినోద్‌నాయక్,యూత్ నాయకులు బరిగె సవీన్ పాల్గొన్నారు.
ప్రలోభ రాజకీయాలకు స్వస్తి పలకాలి
బీబీనగర్ : ప్రలోభ రాజకీయాలకు స్వస్తి పలకాలని కాంగ్రెస్సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు అన్నారు.రాహుల్‌గాంధీ పిలుపుమేరకు కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన మండలంలోని కొండమడుగు గ్రామంలో రైతు డిక్లరేషన్‌పై రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్ఎస్ పాలనతో రాష్ట్ర ప్రజలు, రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందన్నారు. టీఆర్ఎస్ ఎనిమిదేళ్ల పాలనలో సబ్బండ జాతి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. ధరణితో రైతుల పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారైందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా వాటికి స్వస్తి పలకాలని కోరారు.ప్రజలు తమ ఓటు హక్కును వజ్రాయుధంగా వాడుకోవాలని పిలుపునిచ్చారు.రాహుల్‌గాంధీ రైతుల కోసం చేసిన డిక్లరేషన్ రైతులకు శ్రీరామరక్షణ అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ప్రీతమ్, నాయకులు శిరీశ్‌రెడ్డి, మండల అధ్యక్షులు పొట్టోళ్ల శ్యామ్‌గౌడ్, పంజాల రామాంజనేయులు, స్థానిక సర్పంచ్ కడెం లతారాజేశ్బాబు, సింగిల్‌విండో వైస్‌ఛైర్మన్ గడ్డం బాలకష్ణగౌడ్, మాజీ ఎంపీటీసీ దేశం ముత్యాలు పాల్గొన్నారు.
మండలంలోని గుర్రాలదండి గ్రామానికి చెందిన కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ ధరావత్ మంగ్తానాయక్ కుటుంబ సభ్యులు ఏర్పాటుచేసిన విగ్రహాన్ని మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు,కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంగ్తానాయక్ పార్టీకి, ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు.