Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కల్లూరి మల్లేశం
నవతెలంగాణ-చౌటుప్పల్రూరల్
నిరంతరం కార్మికులహక్కుల కోసం పోరాడుతూ హక్కులు సాధించినప్పుడే అమరులకు నిజమైన నివాళ్ళర్పించడమని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కల్లూరి మల్లేశం అన్నారు.ఆదివారం మండలంలోని ఆరెగూడెం గ్రామపరిధిలోని సౌభాగ్య బయోటెక్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ వద్ద కార్మికోద్యమ నేత పర్స సత్యనారాయణ 7 వ వర్థంతి నిర్వహించారు.పర్స చిత్రపటానికి ఆయన పూలమాలలేసి నివాళులర్పించి మాట్లాడారు.నిజాం పరిపాలనకాలంలోనే పర్స సత్యనారాయణ కార్మికులహక్కుల కోసం గళం విప్పి సుదీర్ఘకాలం జైలు జీవితాన్ని గడిపిన యోధుడన్నారు.ఉమ్మడి ఏపీలో కార్మికుల సమస్యలపై సమరశీల పోరాటాలు నడిపారని గుర్తు చేశారు.మండలంలోని పలుకంపెనీల్లో కార్మికుల సమస్యలపై సర్వే నిర్వహించారన్నారు.దేశంలో పాలకులు మారుతున్నారే తప్ప కార్మికుల జీవితాల్లో మార్పులు రావడం లేదన్నారు.మోడీ ప్రభుత్వం ఏడేండ్ల కాలంలో కార్మిక చట్టాలను రద్దు చేసి, కార్పొరేట్ వ్యవస్థకు చుట్టంగా మారుతుందని విమర్శించారు.కంపెనీలలో పని చేస్తున్న కార్మికులకు పని భద్రత లేకుండా పోతుందని తెలిపారు.కార్మికులు హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్దతుల్లో యూనియన్లు ఏర్పాటు చేసుకుంటే యాజమాన్యాలు వేధింపులకు పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వలస కార్మికులతో పని గంటల నిబంధన లేకుండా పరిశ్రమల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయని అన్నారు.దేశంలోని పలు రాష్ట్రాల నుండి వలస వచ్చిన కార్మికులను దోపిడికి గురి చేస్తున్నాయని తెలిపారు.కాంట్రాక్టర్ల నుండి కార్మికులను పనిలోకి తీసుకుంటూ చిన్నగదులల్లో పదుల మందిని ఉంచడం జరుగుతుందని తెలిపారు.ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోతున్న సంఘటనలు పునరావతమవుతున్నా యాజమాన్యాలపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణ లేకుండా పోయిందని విమర్శించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి యండి. పాషా,నాయకులు మల్లేశ్,నర్సిరెడ్డి, వెంకటేష్, లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.