Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ఆర్టీసీ కార్మికులపై యాజమాన్యం వేధింపులు ఆపాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు డిమాండ్ చేశారు.ఆదివారం స్థానిక ఎల్ఐసీ కార్యాలయంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు నెమ్మది వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లా డారు.డొక్కు బస్సులు ఇచ్చి మైలేజీ తీసుకురావాలని డ్రైవర్లను వేధిస్తున్నారని, ఖాళీలను భర్తీ చేయకుండా అదనపు పనిభారం పెంచారని విమర్శించారు. రెండు వేతన ఒప్పందాలను, ఐదు డీఏలను ఇవ్వకుండా కార్మికులను ఆర్థికంగా కుంగ తీస్తున్నారని విమర్శించారు.ఉద్యోగం విడిచి పోయే విధంగా ఉన్నతాధికారుల చర్యలు ఉంటున్నాయని, ఇలాంటి చర్యలను ఉపసంహరించుకోవాలని కోరారు.ఆర్టీసీ కార్మికులకు అండగా యావత్ కార్మిక వర్గం ప్రజలు అండగా ఉంటారని, ఆర్టీసీ కార్మికులు భయ పడవద్దన్నారు.కార్మికవర్గం పోరాడి సాధించుకున్న హక్కుల్ని కాపాడుకోవాలని అందుకు సీఐటీయూపూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.డీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు లింగయ్య మాట్లాడుతూ ఆయిల్ విలువను డ్రైవర్లను నుండి రికవరీ చేయడం దారుణమని పేర్కొన్నారు.సంస్కరణల్లో భాగమే కార్మికులపై భారాలు మోపుతున్నారని ఆర్టీసీ కార్మికులకు అండగా ఉపాధ్యాయ ఉద్యోగులు ఉంటారని పేర్కొన్నారు.టీఎస్‌యుటిఎఫ్ జిల్లా కోశాధికారి వెంకటయ్య మాట్లాడుతూ ఆర్టీసీ ప్రజా రవాణా సంస్థ అని లాభనష్టాలను బేరీజు వేసుకో రాదని సూచించారు.ఎల్ఐసీఏఐఈఏ బ్రాంచి అధ్యక్షులు రామయ్య మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించుకోవడానికి ఐక్యఉద్యమాలు సాగించాలని పేర్కొన్నారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి మాట్లాడుతూ ఉద్యోగులను బెదిరించి పనిచేయించు కోవడం ప్రభుత్వానికి తంతుగా మారిందని విమర్శించారు.సీఐటీయూ జిల్లా నాయకులు ఎన్.రాంబాబు,ఎం.శేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం వాడుకున్న కార్మికుల పీఎఫ్, సీసీఎస్ డబ్బులను వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎల్ఐసీఏఐఈఏ నాయకులు చాంద్‌పాషా, నరేష్, ఐద్వా జిల్లా కార్యదర్శి సైదమ్మ, రవి ఐఎఫ్టీయూ నాయకులు రామోజీనాయక్,నాగునాయక్, సీఐటీయూ నాయకులు సుధాకర్,లక్ష్మణ్, పిచ్చయ్య, సైదులు పాల్గొన్నారు.