Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య
- కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ -నల్లగొండ
ఉపాధి హామీ కూలీలకు ప్లే షిప్పులు అందజేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య అన్నారు. యాప్‌తోనే ఉపాధి హాజరుఅనే కేంద్ర ప్రభుత్వ డైరెక్షన్ ను, రాష్ట్ర ప్రభుత్వ సర్క్యులర్ నెం 333ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకనుగుణంగా రోజు కూలి రూ.600 ఇచ్చి సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమ్మర్ అలవెన్స్ ఇచ్చే విధానాన్ని కొనసాగించాలన్నారు . అందరికీ పనిముట్లు గడ్డ పార పార . తట్ట . కొడవలి . గొడ్డలి అందజేసి పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. పని ప్రదేశంలో మెడికల్ కిట్టు అందుబాటులో ఉంచాలన్నారు. వడదెబ్బ తగలకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలన్నారు. వాటర్ బిల్లు గడ్డ పరమొన డబ్బులు ప్రయాణ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. కూలీలకు పెండింగ్ లో ఉన్న గత సంవత్సరం పని చేసిన బిల్లులు ఇవ్వాలనారు . ఉచిత భీమా సౌకర్యం కల్పించి . పిల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలనారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున కూలీలతో పాటు అధికారులు కూడా ఉదయమే వచ్చి హాజరు తెలుసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నారిఐలయ్య, జిల్లా అధ్యక్షులు చిన్న వెంకులు, రాష్ట్ర కమిటీ సభ్యు లు కత్తుల లింగస్వామి,దండెంపల్లి సరోజ , మారయ్య ,కంబాలపల్లి ఆనంద్ , కందుల సైదులు, జిల్లా కమిటీ సభ్యులు మల్లేశ్వరి ,అమతమ్మ , వజ్రమ్మ ,కిరణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.