Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
దేవరకొండ ప్రభుత్వ పెన్షనర్స్ భవనంలో ఈ నెల 25న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీ మహాలక్ష్మి కంటి వైద్యశాల హైద్రాబాద్ వారిచే పెన్షనర్స్కి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష కార్యదర్శులు తాడిశెట్టి నర్సింహ,అంకం చంద్రమౌళి తెలిపారు. శిబిరానికి హాజరగు పెన్షనర్స్ తమ హెల్త్ కార్డు వెంట తీసుకొని రావాలన్నారు.ఆపరేషన్ అవసరం కలిగిన వారిని తమ వెంట తీసుకువెల్లి ఆపరేషన్ చేసి తిరిగి దేవరకొండకు చేరుస్తారన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో జమ, ఖర్చులు , ఓటర్ లిస్ట్ ఆమోదం తెలిపారు.ఈ సమావేశంలో కోశాధికారి పంగునూరి లింగయ్య, ఉపాధ్యక్షులు వనం బుచ్చయ్య, ప్రచార కార్యదర్శి ఆకులపల్లి ఐజాక్, జిల్లా ఉపాధ్యక్షులు కంచెర్ల నారాయణ రెడ్డి, కార్యవర్గ సభ్యులు చెన్నయ్య, కుంభం రాములు, జంపాల యాదగిరి, గంగిడి దామోదర్ రెడ్డి, మాదాసు రాములు, అంకూరి సుగుణయ్య, పులిజాల రామచంద్రం, జీవరత్నం పాల్గొన్నారు.