Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెద్దవూర :మండలంలో సోమవారం పదవ తరగతి తెలుగు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.పెద్దవూర జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో 268 మందికి 3,శ్రమ పాఠశాలలో 149 మందికి 4గురు,నాగార్జునసాగర్ సెయింట్జోసఫ్ పాఠశాలలో 199 మందికి 4 గురు,సాగర్ జెడ్పీహెచ్ఎస్లో 155 మంది విద్యార్థులకు 155 మంది పరీక్షకు హాజరయ్యారు.మొత్తం 775 మంది విద్యార్థులకు 764 మంది హాజరు కాగా 11మంది గైర్హాజరయ్యారని ఎంఈఓ బాలునాయక్ తెలిపారు.
నిడమనూరు:మండలంలో మొత్తం మూడు పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు.మండలకేంద్రంలోని ఆదర్శ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు మండలంలోని ముకుందాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండలం లో మొత్తం 467 మంది విద్యార్థులకుగాను పరీక్షకు 464 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్షాకేంద్రాలను తహసీల్దార్ హెచ్.ప్రమీల, ఎంఈఓ బాలనాయక్,ఫ్లయింగ్ స్క్వాడ్ బందం శంకరయ్య, శ్రీకాంత్ పరిశీలించారు.
నాగార్జునసాగర్: నందికొండ మున్సిపాలిటీలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరిగాయి.నాగార్జునసాగర్ పరిధిలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్,సెయింట్ జోసెఫ్ పాఠశాలలో 2 పరీక్షాసెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 370 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా అందులో 4 గురు విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు.