Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ చైర్మెన్ బండ నరెందర్ రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ -నార్కట్‌పల్లి
పేదింట్లో పుట్టిన ఆడబిడ్డ తల్లిదండ్రులకు భారం కావొద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని జెడ్పీ చైర్మెన్ బండ నరెందర్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని శభరి గార్డెన్స్‌లో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 74మంది లబ్దిదారులకు 74 లక్షల 08584 రూపాయల విలువ గల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సంక్షేమం కోసం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. మహిళామణులందరి ఆశీస్సులు కేసీఆర్ పై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరెందర్ రెడ్డి , తాసిల్దార్ పల్నాటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మండల అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ లు,,గ్రామ శాఖ అధ్యక్షులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.