Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్ట నగేష్
నవతెలంగాణ -నార్కట్పల్లి
దళిత బందు కోసం రాజకీయాలకు అతీతంగా దళితులు దండు కట్టాలని కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్ట నగేష్ అన్నారు. మండలంలోని గోపలాయపల్లిలో సోమవారం ఆ సంఘం ఆధ్వర్యంలో జరిపిన సర్వేలో ఆయన మాట్లాడారు. ప్రతి దళిత కుటుంబానికీి మూడెకరాల భూమి ఇస్తామన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మాట నీటి మూటగానే మారి ఆ పథకంపై ప్రభుత్వం అటకెక్కించిందని విమర్శించారు. దళిత బంధు పథకం లబ్దిదారుల ఎంపికశాసనసభ్యులకు ,మంత్రులకు కాకుండా జిల్లా కలెక్టర్లకు అప్పజెప్పి పారదర్శకంగా ఉండాలని డిమాండ్ చేశారు. నియోజక వర్గానికి వంద మందిని మాత్రమే ఎంపిక చేయడం సరికాదన్నారు. అనంతరం దళితల సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా నాయకులు దండు రవి,ప్రజా సంఘాల నాయకులు గాలి నర్సింహ,లక్ష్మి,శ్రీకాంత్ క్రిష్ణయ్య, వెంకటయ్య,రామస్వామి,నీలమ్మ,స్వామి తదితరులు పాల్గొన్నారు.
ధర్నాలను విజయవంతం చేయాలి
చిట్యాల : పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నిరసిస్తూ ఈ నెల 27నుండి 31వ తేదీ వరకు వామపక్షాల ఆధ్వర్యంలో జరిగే నిరసన ప్రదర్శనలు,ధర్నాలను విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు జిట్ట నగేష్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు.నిత్యావసర వస్తువులతోపాటు భూముల రిజిస్ట్రేషన్,కరెంటు చార్జీలు, ఆర్టీసీ వంటి చార్జీలు పెరగడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలపై మెయలేని బారాలు పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 27వ తేదీ మండల,పట్టణ కేంద్రాలలో,30వ తేదీ న జిల్లా కలెక్టరేట్ ముందు,31 న హైదరాబాద్ లో ధర్నాలు,నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు.