Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీ మెజార్టీతో గెలిపించండి
- కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ అసెంబ్లీ బరిలోనే ఉంటానని కార్యకర్తలు భారీ మెజార్టీతో గెలిపించాలని భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తన నూతన కార్యాలయంలో కార్యకర్తల మధ్య జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి మాట్లాడారు. అంతకుముందు మర్రిగూడ బైపాస్ నుండి నూతన కార్యాలయం వరకు పది వేల మందితో నాయకులు కార్యకర్తలు కోలాటాల మధ్య బాంబుల చప్పుళ్లతో బ్యాండు మేళాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా వెంకట్ రెడ్డి కార్యకర్తలుగుండె కంటే ఎక్కువ అన్నారు.శరీరానికి గుండె ఎంత ముఖ్యమో నల్లగొండ అంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేశానని తెలిపారు.పదవి త్యాగం చేయడంతో నల్లగొండను మరింత అభివద్ధి చేయలేకపోయానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ నుంచి భారీ మెజార్టీతో గెలిపిస్తే పార్టీలకు అతీతంగా నల్లగొండ ను మరింత అభివద్ధి చేస్తానని తెలిపారు. గతంలో మాదిరిగానే వచ్చే ఎన్నికల్లో తనపై మరింత ఆదరణ చూపి భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రాజీలేని పోరాటం చేసి కేసీఆర్ ను గద్దె దించుతా
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో రాజీ లేని పోరాటం చేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించుతానని భువనగిరి పార్లమెంటు సభ్యులు, తెలంగాణ స్టార్ క్యాంపెయిన్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆయన నూతన కార్యాలయంలో పుట్టినరోజు సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ స్టార్ క్యాంపెయిన్‌గా ప్రచారం చేసి 40నుండి 50 సీట్లు గెలిపిస్తానని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు .తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని ఆయన విమర్శించారు. కేసీిఆర్ పంజాబ్ ప్రభుత్వానికి 30కోట్లు నిధులు ఇచ్చావు అవి ఎవరబ్బ సొమ్ము అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వ్యవసాయానికి ఉపాధి కూలీలను అనుసందానం చేస్తామన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ మంజూరు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, ఈ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, నల్లగొండ మండల జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, కనగల్ మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్‌గౌడ్, తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు జూకూరి రమేష్, పట్టణ కౌన్సిలర్లు,వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.