Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరిసాగర్
మార్చి 15న ముఖ్యమంత్రి కేసీఆర్ ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొర్రాశంకర్నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారంమండలకేంద్రంలో ఆయన మాట్లాడుతూ తను మాట ఇస్తే మెడకాయ నుంచి తలకాయ తెగిపడ్డా ఆ మాటను వెనక్కు తీసుకోనని చెప్పే సీఎం కేసీఆర్ ఇప్పటిదాకా ఆయన మాట ఇచ్చి తప్పిన మాటలు ఎన్నో ఉన్నాయిన్నారు.అందులో తెలంగాణలో దళితుడే తొలి సీఎం, దళితులకు 3 ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భతి, డబుల్బెడ్రూం ఇండ్లు, రూ.లక్ష రుణమాఫీ, 57 ఏండ్లకు పింఛన్లాంటివి చాలా ఉన్నా యన్నారు.గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఈ పనులు అప్పచెప్పడం వలన గ్రామంలో పారిశుధ్యం, అభివద్ధి పనులు ఆగిపోతు న్నాయన్నారు.ఈ కార్యక్రమంలో కల్లు గీత కార్మికసంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు వేములకొండ పుల్లయ్య, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంగోతు రెడ్యానాయక్ పాల్గొన్నారు.