Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు కందాల ప్రమీల
నవతెలంగాణ- నకిరేకల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పై, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలను ఉధృతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు కందాల ప్రమీల పిలుపునిచ్చారు. శాలిగౌరారం మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయలో పార్టీ కార్యకర్త లకు ఒక్కరోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు అనేక రకాల వస్తువులపై విపరీతంగా ధరలు పెంచుతూ సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో పోరాటాలను ఉధతం చేయక తప్పదన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు చినపాక లక్ష్మి నారాయణ శిక్షణాతరగతులు నిర్వహించగా, మండల కార్యదర్శి చలకాని మల్లయ్య, సీఐటీయూ మండల అద్యక, కార్యదర్శకులు గుండ్లపల్లి వెంకన్న, ఓగోటి కిరణ్ కుమార్, నాయకులు కరంగుల వెంకన్న అంకర్ల కొమరయ్య, బట్ట అవనిజ, లింగ ప్రసాద్ సైదులు, శ్రీను, ఇస్మాయిల్, డెంక లింగయ్య, చలకాని లింగమల్లు, నూనె గట్టయ్య, బట్ట రామచంద్రయ్య పాల్గొన్నారు.