Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అఖిలపక్ష పార్టీల ధర్నా
- అత్యవసర పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసిన సర్పంచ్
- కంచెను తొలగించాలని పాలకవర్గం తీర్మానం
నవతెలంగాణ- సంస్థాన్ నారాయణపురం
మండల కేంద్రంలో గతంలో ఆర్టీసీ బస్టాండ్ కోసం కేటాయించబడి, ప్రస్తుతం అంగడి కొనసాగుతున్న స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని కోరుతూ సోమవారం అఖిలపక్ష పార్టీల నాయకులు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు గ్రామంలో పెద్ద సంఖ్యలో దప్పులతో ర్యాలీ నిర్వహించారు. కచ్చితమైన హామీ ఇచ్చే వరకు లేచేది లేదంటే భీష్మించి కూర్చున్నారు.చేసేదేమీలేక సర్పంచ్ కిలోమీటర్ల శ్రీహరి అత్యవసరంగా పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలోని 443,464 సర్వేనెంబర్లోని రెండున్నర ఎకరాల భూమిని ప్రభుత్వ ఆర్టీసీకి కేటాయించబడిన రూ.2 కోట్ల విలువ చేసే 670 గజాల ప్రభుత్వ భూమిని టీిఆర్ఎస్కు చెందిన గుతా ప్రేమ్చంద్ రెడ్డి అక్రమ పద్ధతుల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకుని కబ్జా చేసినట్టు పాలకవర్గ సభ్యుల దష్టికి తీసుకుపోయారు. అంతే కాకుండా ఆదివారం అధికారులు ఎవరూ లేని సమయంలో ఆ స్థలం చుట్టూ దౌర్జన్యంగా కంచె ఏర్పాటు చేసినట్టు వివరించారు.ప్రజలకు చెందాల్సిన ఆస్తులని ఒకరు అనుభవించడం ఏంటి అని భావించిన పాలకవర్గ సభ్యులు ప్రేమ చందర్ రెడ్డి ఆర్టీసీ బస్టాండ్ కోసం కేటాయించిన స్థలం చుట్టూ ఏర్పాటుచేసిన తొలగించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం మేరకు సర్పంచ్ పాలకవర్గ సభ్యులు గ్రామస్థుల సహకారంతో కంచెను తొలగించారు. ఇంతలోనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. గ్రామ పంచాయతీ పాలకవర్గ తీర్మానం మేరకు అక్కడ పనులు చేపడుతున్న గ్రామపంచాయతీ ట్రాక్టర్ వాహనం తాళం చేవిని ఎస్సై యుగేందర్ లాక్కున్నారు. దీంతో ఎస్ఐకి సర్పంచ్ కు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది ప్రజలను అక్కడినుంచి వెళ్లాల్సిందిగా ఎస్సై ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని అక్కడికి వచ్చిన ప్రజలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు మందుల బాలకష్ణ, చిలువేరు అంజయ్య, సూర్య పల్లి శివాజీ, వలిగొండ యాదయ్య, బద్దుల యాదగిరి, ఉప్పల లింగస్వామి, ఏర్పుల అంజమ్మ, చిలువేరు బుగ్గ రాములు, కే శ్రీను, ఉప్పర గొని నగేష్, జక్కి మల్లారెడ్డి,బంధం యాదయ్య, పాలకుల సతీష్, గూడూరు ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.