Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విఫలమైన దొంగలు
- గోప్యంగా ఉంచిన పోలీసులు
నవతెలంగాణ-వేములపల్లి
మండలకేంద్రంలోని ఎస్బీఐలో బ్యాంకు దోపిడీకి ప్రయత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకులో ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో బ్యాంకు వెనుకభాగం నుండి వెంటిలెటర్‌ను పగులగొట్టి బ్యాంకు లోపలికి ప్రవేశి ంచారు.బ్యాంకులో సీసీ కెమెరాలు పనిచేయకుండా ఉండాలని ఆన్లైన్ సర్క్యూట్ వైర్లను కత్తిరించారు. అనంతరం లోపలికి ప్రవేశించారు స్ట్రాంగ్‌రూమ్ లోకి వెళ్లి లాకర్లను పగలగొట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. బ్యాంకులోని సామగ్రిని అస్తవ్యస్తంగా చేశారు. విషయాన్ని బ్యాంకు మేనేజర్ మధు ఆదివారం ఉదయం పోలీసుల దష్టికి తీసుకువచ్చారు.ఎస్సై రాజు బ్యాంకును సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.ఆదివారం తెల్లవారుజామున జరిగిన సంఘటన గోప్యంగా ఉంచారు.సీసీఫుటేజీలను పరిశీలించి, చోరీకి పాల్పడ్డ వారి కోసం విచారిస్తున్నట్లు సమాచారం.పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న బ్యాంకులో చోరీ ప్రయత్నం జరిగిన సంఘటనతో స్థానికులు హడలిపోతున్నారు.స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలో రాత్రివేళలో నిఘా లేకపోవడం, పెట్రోలింగ్ లేకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సీసీకెుెరాలు ఏర్పాటు చేసి చోరీలకు పాల్పడే వారిపై నిఘా పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.