Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు భవన నిర్మాణాలకు నోటీసుల జారీ
- మిర్యాలగూడలో చర్చ
నవతెలంగాణ-మిర్యాలగూడ
దినదినాభివద్ధి చెందుతున్న మిర్యాలగూడ పట్టణంలో అక్రమ నిర్మాణాలు కూడా జోరుగా సాగుతున్నాయి.అనుమతులు లేకుండానే బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు.మిర్యాలగూడలో అక్రమ నిర్మా ణాలపై తెలంగాణ టాస్క్ఫోర్స్ శాఖకు ఫిర్యాదులు అందాయి దీంతో జిల్లా టాస్క్ఫోర్స్ అధికారుల బందం కొన్ని రోజులుగా విస్తతంగా పరిశీలించింది.వాటిలో ముందుగా ఏడు భవనాలు అక్రమ నిర్మా ణాలుగా ఉన్నట్టు గుర్తించారు.ఇందులో రెండు సాగర్ రోడ్డు వెంబడి నిర్మాణ దశలో ఉన్న రెండు భవనాలలో జిల్లా టాస్క్ఫోర్స్అధికారుల బందం సోమవారం తెల్లవారుజామున కూల్చివేసింది.ప్రొక్లయిన్ల ద్వారా నిర్మాణాలను తొలగి ంచారు.అదేవిధంగా మరో ఐదు భవనాలు అక్రమంగా నిర్మించాలని అనుమతులు లేకుండానే బహుళ అంతస్తులు ఏర్పాటు చేశారని, సెల్లార్ అనుమతి లేదని, రోడ్డుపై మెట్లు నిర్మించిన వారిని గుర్తించి నోటీసులు జారీ చేశారు.7రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.ఈ సందర్భంగా కమిషనర్ రవీంద్రసాగర్ మాట్లాడుతూ టాస్క్ఫోర్స్ బందం పట్టణంలో విస్తతంగా పరిశీలిస్తుందని, ఐదుగురితో కూడిన బందం ఈ తనిఖీలు చేస్తుందని తెలిపారు.అక్రమ నిర్మాణాలను కూల్చి వేయిస్తుం దన్నారు.భవిష్యత్లో పట్టణంలో అన్ని నిర్మాణాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.