Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలి
- అదనవు కలెక్టర్ ఎస్.మోహన్రావు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో జాన్ 2న నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అధికారులు విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ యస్.మోహన్రావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జూన్,2న చేపట్టే తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణపై జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో డీఆర్ఓ రాజేంద్రకుమార్తో కలిసి మాట్లాడారు.కరోనా నేపథ్యంలో రెండు పర్యాయాలు వేడుకలు ఘనంగా చేయలేక పోయామన్నారు.ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా జూన్2 న స్థానిక కలెక్టరేట్ నందు చేపట్టబోయే వేడుకల నిర్వహణకు సంబంధించిన పనులను అధికారులు సమన్వయంతో కలిసి చేయాలని సూచించారు.వేడుకల నిర్వహణలో భాగంగా జిల్లా అభివద్ధిపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యుల సందేశం కోసం అన్ని శాఖల అధికారులు తమ శాఖల ద్వారా చేపడుతున్న అభివద్ధి కార్యక్రమాల వివరాలను ఈ నెల 25 నాటికి జిల్లా ప్రణాళిక అధికారి, డీపీఆర్ఓ కార్యాలయానికి మెయిల్, హార్డ్ కాపీలను అందచేయాలని సూచించారు.ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్, సీపీఓ వెంకటేశ్వర్లు, డీఈఓ రామారావునాయక్, డీఎస్ఓ విజయలక్ష్మీ, డీఎంహెచ్ఓ కోటాచలం, విద్యుత్, విద్య, ఫైర్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.