Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హమాలీ రేట్లు పెంచాలని సీపీఐ మండల కార్యదర్శి పల్లె శేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం చౌటుప్పల్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట హమాలీ కార్మికులు ధర్నా చేపట్టారు. అనంతరం తహశీల్దార్ దశరథకు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై హమాలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాపగళ్ల శంకరయ్య,సీపీఐ పట్టణ కార్యదర్శి పగిళ్ళ మోహన్ రెడ్డి,నాయకులు రెహమాన్,బద్ధుల సుధాకర్, కార్మికులు సైదులు,శంకరయ్య, వెంకటయ్య,సంజీవ, ఈశ్వర్,నరేష్,లింగస్వామి, మహేష్,తదితరులు పాల్గొన్నారు.
భువనగిరిరూరల్ : పెరుగుతున్న ధరలకనుగుణంగా సివిల్ సప్లయి కార్పొరేషన్లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు క్వింటాకు రూ.30కు పెంచి ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి.ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసిల్దార్ కొప్పుల వెంకట్ రెడ్డికి అందజేశారు. ఈ కారిక్రమంలో హమాలీ కార్మికులు ముదిగొండ బసవయ్య, పాశం అంజయ్య, చొప్పరి సత్తయ్య, సత్యనారాయణ, శీను,రాజు,జహంగీర్, పరశురాములు,గణేష్,రాజు, కష్ణ పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ : హమాలీల కూలి రేట్లు పెంచాలని కోరుతూ సివిల్ సప్లయిస్ హమాలీ యూనియన్ కార్మికులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు చక్క వెంకటేష్, పట్టణ కార్యదర్శి గొట్టి పాముల శ్రీనివాస్, హమాలి సంఘం అధ్యక్షులు పల్లె శ్రీనివాస్ , సత్యనారాయణ, శ్రీను, రవి, వేంకటయ్య, సిద్ధులు, బీరయ్య తదితరులు పాల్గొన్నారు .