Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేసవిని తాళలేక పోతున్న ప్రజలు
- కరెంటు బిల్లులతో బెంబేల్
- అంతంతమాత్రంగానే మామిడి పండ్లు
నవతెలంగాణ - భువనగిరి
ఎండ వేడిమితో యాదాద్రి భువనగిరి జిల్లాలో సూర్యుడి కిరణాలకు భగభగ మండుతోంది. వేసవి ఎండ తీవ్రత ను తళ్ళలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎండ తీవ్రతతో భువనగిరి పోలీస్ స్టేషన్లో పలు వాహనాలు అగ్నికి ఆహుతి అయిన విషయం మనకు తెలిసిందే. ఒకవైపు ఎండ తీవ్రత ఉంటే మరోవైపు, విద్యుత్ వినియోగ చార్జీలు పెరగడంతో బిల్లు చూసి బేబేలు ఎత్తుతున్నారు. జిల్లాలో వలిగొండ బీబీనగర్ అడ్డగూడూరు భువనగిరి ప్రాంతంలో 42 డిగ్రీలకు చేరింది. అడ్డగూడూర్ లో అతి ఎక్కువగా 42.5 డిగ్రీల ఎండ ఉండగా అతి తక్కువగా తుర్కపల్లి మండలంలో 29.9 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యింది. మధ్యాహ్నం పూట వ్యాపారాలు సాగడం లేదు.
తగ్గిన మామిడికాయ దిగుబడి
జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా మామిడికాయ దిగుబడి తగ్గిపోయింది. దీంతో మామిడికాయ ధర కిలోకు రూ. 60 నుండి రూ 100 ధర పలుకుతోంది. పండు మామిడికాయ ధరలతో పాటు పచ్చడి మామిడికాయ తగ్గింది. అధిక ధరలు పెరిగాయి.
జోరందుకున్న చల్లని పానీయాల అమ్మకాలు.
చల్లని పానీయాలు అయినా కూల్ డ్రింక్స్, వివిధ కంపెనీల బాదం మిల్క్ లస్సి ప్యాకెట్ల తో పాటు ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చి ఏర్పాటుచేసిన పానీయాల సెంటర్ల, కొబ్బరి బొండాల అమ్మకాలు జోరందుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 150 షాపులు ఆంధ్ర నుండి వచ్చి చల్లని శీతలపానీయాల అమ్మకాల కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు గోలీసోడా అమ్మకాలు పెరిగాయి. గోలి సోడా ల ధరలు రూ 60 వరకు చేరుకుంది. వైన్ షాప్ లలో చల్లని బీరు స్టాకు దొరకడం లేదు. రహదారుల వెంబడి తాటి ముంజలు అమ్ముతున్నారు. వాటి ధరలు పెరిగాయి. వందకు ఆరు నుండి ఎనిమిది మాత్రమే ఇస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా కళ్లు ఫ్రిజ్లో పెట్టుకొని శీతల పానీయం ల తాగుతున్నారు
స్విమ్మింగ్ ఫుల్ కు క్యూ కడుతున్న యువకులు.
భువనగిరి శివారు ప్రాంతాలలో ఉన్న స్విమ్మింగ్ పూల్స్ కు యువకులు సాయంత్రం వేళలో క్యూ కడుతున్నారు. దేశ తీవ్రతను తగ్గించుకోవడానికి సిమ్మింగ్ఫుల్ వెళ్లి గంటలపాటు ఈత కొడుతున్నారు. స్విమ్మింగ్ పూల్ వద్ద నిర్వాహకులు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.