Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
జీఎంపిఎస్ రాష్ట్ర మహాసభలను మే 30,31 మరియు జూన్ 1న మూడు రోజులపాటుగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నారు. మహాసభల నిర్వహణ కోసం ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశారు. ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులుగా బండారు నర్సింహ, అధ్యక్షులుగా కల్లూరి మల్లేషం, ప్రధాన కార్యదర్శిగా ఉడుత రవీందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మద్దెపురం రాజు, కోశాధికారి దయ్యాల నర్సింహలతో పాటుగా మరికొంత మంది యాదవ ప్రజాప్రతినిధులు, మేధావులు, ఉద్యమకారులను ఆహ్వాన సంఘం సభ్యులుగా ఎన్నుకున్నారు.
మూడు రోజుల మహాసభలు ....
జీఎంపీఎస్ 3వ రాష్ట్ర మహాసభలు మే 30, 31, జూన్ 1న భువనగిరి పట్టణంలోని ఏఆర్ గార్డెన్లో నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 500మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరవుతున్నారు. మహాసభలలో భాగంగా 30న జీఎంపీఎస్ స్థానిక ఏఆర్ గార్డెన్లో బహిరంగ సభ నిర్వహిస్తారు. అంతకుముందు ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి ఏఆర్ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభ జరుగుతుంది.ఈ సభకు ముఖ్యఅతిధులుగా ప్రోఫెసర్ కంచ ఐలయ్య, గాయకులు వరంగల్ శ్రీనివాస్, నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల భగత్కుమార్తో పాటుగా ఇతర ముఖ్యనాయకులు పాల్గొంటారు. 31న రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ప్రతినిధుల మహాసభ జరుగుతుంది. గొర్రకాపరులకు సంబందించిన సమస్యలు, వాటి పరిష్కారం ఇప్పటివరకు చేపట్టిన ఆందోళనలు, భవిష్యత్లో నిర్వహించాల్సిన ఉద్యమాలు వాటిపై పూర్తిస్తాయిలో చర్చిస్తారు.జూన్ 1న నూతన రాష్ట్ర కమిటిని ఎన్నుకుంటారు.
జీఎంపిఎస్ డిమాండ్స్..
ప్రభుత్వం గొర్రెకాపరులకు ప్రవేశపెట్టిన పథకాలు క్షేత్రస్థాయిలో లబ్దిదారులకు సరైన రితీలో అందడంలేదు. దాంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. వాటన్నింటి అందరికి చేరవేయాలంటే జీఎంపిఎస్ ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను పెట్టింది.
-సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రెండవ విడత గొర్రెల పంపిణీలో భాగంగా లబ్దిదారులకు నగదును భ్యాంకు ఖాతాలో జమచేయాలి
-చనిపోయిన గొర్రెలకు నష్టపరిహారం ఇవ్వాలి. అన్ని గొర్రెలకు ఇన్సురెన్సు చేయించాలి.
-సోసైటీల కోసం 20ఏకరాలభూమిని ప్రభుత్వం కేటాయించాలి
-గొర్రెల కోసం సాముహిక షేడ్లు నిర్మాణం చేపట్టాలి.
- 50ఏళ్లు దాటిన వృధ్దులకు వృద్దాప్య పెన్షన్ ఇవ్వాలి.
-జీవో నెంబర్ 64 ప్రకారం ప్రస్తుతం ప్రమాధభీమా రూ.1లక్ష వరకే ఉంది. ఇపుడు రూ.10లక్షల వరకు పెంచాలి.
- యువతకు రూ.50లక్షల వరకు రాయితీ సౌకర్యం కల్పించి గొర్రెలను కొనుగోలు చేయడానికి ప్రోత్సహించాలి.
- జీవో నెంబర్ 559, 1016 లను ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయాలి.ఈ జీవో ప్రకారం పోరంబోకు భూములలో మేత, చెరువులలో చెట్లపై గొర్రెల కాపరులకు హక్కు ఉంది.
జీఎంపిఎస్ బహిరంగ సభను జయప్రదం చేయాలి
-కల్లూరి మల్లేశం, ఆహ్వాన అధ్యక్షులు
జీఎంపిఎస్ రాష్ట్ర మహాసభలు
రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల కాపరుల సమస్యలను పరిష్కరించుకు నేందుకు పోరాటమే సరైన మార్గం. అందులో భాగంగానే రానున్నరోజుల హక్కులను కాపాడుకోవడంతోపాటుగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేర్చు కోవడానికి ఐక్యంగా పోరాటం చేయాలి. అందులో భాగంగా జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలి.