Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో ఉపాధికూలీలకు చేసిన పనికి మూడు నెలలుగా వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదని, వెంటనే వేతనాలను విడుదల చేసి కూలీలను ఆదుకోవాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు.సోమవారం ఆ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కలెక్టరేట్ ముందు తెలంగాణ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యూబిక్ మీటర్ల కొలతలు రద్దు చేసి చట్టం ప్రకారం నిర్ణయించిన వేతనాలను చెల్లించాలని కోరారు.నేషనల్ మానిటరింగ్ మొబైల్ సిస్టం పద్ధతి ద్వారా కూలీల హాజరు కోసం తెచ్చిన సర్కులర్ నెంబర్ 333 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మనిషికో జాబ్‌కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.పేదలకు ఉపాధి పని కల్పించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు కు ఉపాధి హామీ పని చేస్తున్న కూలీలకు గడ్డపార, పార, పలుగు,తట్ట , నీడ కోసం టెంటు, మెడికల్ కిట్ లు ఇవ్వక పోవడంతో కూలీలు నానాయాతన పడుతున్నారన్నారు.5 కిలోమీటర్లు దాటితే ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వాల్సి ఉన్నా ప్రభుత్వం వాటిని కూడా నిలుపుదల చేసిందన్నారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ హేమంత్‌కేశవ్, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్‌కు అందజేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు వెలది పద్మావతి, జిల్లా ఉపాధ్యక్షులు పులుసుసత్యం, సోమపంగ జానయ్య, షేక్ పటాన్,మహబూబ్అలీ,నారసాని వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు దోసపాటి భిక్షం,అరె రామకష్ణారెడ్డి,పడమటింటి నగేష్,మిట్టపల్లిలక్ష్మి, వనం సోమన్న, లింగయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.