Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
మండలంలోని తొండ గ్రామపరిధిలో ఏర్పాటుచేసిన ఐకేపీ సెంటర్లో రైతులు ధాన్యాన్ని కొద్దిరోజుల కింద దొంగలు ఎత్తుకుపోవడ్లం రైతులు రైతుసంఘానికి సమాచారం అందించారు.దీంతో ఆ సంఘం జిల్లా కార్యదర్శి దండా వెంకట్రెడ్డి సకాలంలో స్పందించి ఐకేపీలోని ధాన్యాన్ని సందర్శించారు. ఈ మేరకు ఐకేపీ నిర్వహిస్తున్న పొదుపు సంఘ బంధం అధ్యక్షులతో అలాగే రైతులతో మాట్లాడి కాంటాలు ఆపడం మంచిది కాదని,వానాకాలం దగ్గరికి వస్తుందని రైతులకు ఇబ్బంది కలుగుతుందని త్వరగా కాంటాలు వేసి కోనుగోలు వేగవంతం చేయాలని కోరారు.అక్కడే ఉండి ధాన్యం కాంటాలు వేయించారు, ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కార్యదర్శి దండ వెంకట్రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శిపల్లా సుదర్శన్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గుమ్మడవెల్లి ఉప్పలయ్య, వెంకటయ్య వెంకన్న పాల్గొన్నారు.