Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ- కేతెపల్లి /నకిరేకల్
అభాగ్యులకు అండగా...ఆర్థిక భరోసాగా సీఎం సహాయ నిధి అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం నకిరేకల్‌లోని క్యాంపు కార్యాలయంలో నకిరేకల్, కేతెపల్లి మండలాలకు 35మందికి రూ.20లక్షల, సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మంగళవారం అందజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ బంటు మహేందర్ ,టీఆర్ఎస్ జిల్లా నాయకులు కొప్పుల ప్రదీప్ రెడ్డి , మండల అధ్యక్షుడు మారం వెంకట్ రెడ్డి ప్రధాన కార్యదర్శి చెమట వెంకన్న యాదవ్, మండల అధ్యక్షులు వంటల చేతన్ కుమార్ వివిధ గ్రామాల సర్పంచులు , ఎంపీటీసీలు పాల్గొన్నారు.
రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ గా మహేందర్
మండల రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్‌గా మండలంలోని చెరుకుపల్లి గ్రామానికి చెందిన టీిఆర్‌ఎస్ నాయకులు బంటు మహేందర్‌ను నియమిసూ, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బంటు మహేందర్ కి మంగళవారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ రైతులకు పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అందేటట్లు చూస్తానని చెప్పారు.