Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ప్రవేశ పెట్టాలి
- వ్యకాస జిల్లా ప్రధానకార్యదర్శి నారి ఐలయ్య
- ప్రజాసంఘాల సర్వేలో పలు సమస్యలు వెల్లడి
నల్లగొండ :నల్లగొండ పట్టణంలో డ్రయినేజీ నిర్మాణం చేయకుండా సీసీ రోడ్లు వేయడం ద్వారా మురికి నీరు బయటికి పోక దుర్గంధం వ్యాపిస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలయ్య అన్నారు. మంగళవారం పట్టణ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 11వ వార్డు కతాల్ గూడెం, అర్బన్ కాలనీ లో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం కాకుండా డ్రయినేజీ నిర్మాణం చేయకుండా ఇస్టానుసారంగా సీసీ రోడ్లు వేయడం ద్వారా మురికి నీరు రోడ్లపై పారుతూ పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉందని తెలిపారు. కొన్ని ప్రాంతాలలో మంచినీరు సరఫరా కావడం లేదన్నారు. పారిశుధ్యం నిర్వహణ సరిగ్గా లేదన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించి రోజు కూలి రూ. 600 ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య , వ్యకాస మహిళా కార్మికుల జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి భూతం అరుణ, వివిధ ప్రజా సంఘాల నాయకులు పనస చంద్రయ్య, దండం పల్లి మారయ్య, యాదయ్య కలమ్మ మాధవి నవీన్ కష్ణ మల్లయ్య సైదులు తదితరులు పాల్గొన్నారు.