Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు మిరియం వెంకటేశ్వర్లు
నవతెలంగాణ -భువనగిరి
దేశ చరిత్రను బీజేపీ ప్రభుత్వం వక్రీకరిస్తోందని సీపీఐ(ఎం) ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు మిరియం వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం స్థానిక దుంపల మల్లారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ భవనంలో పీఎస్ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ప్రాచిన భారతదేశ చరిత్ర పై జరిగిన స్టడీ సర్కిల్ లో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ చరిత్రను వక్రీకరిస్తోందన్నారు. తన బావజలానికి అనుకూలంగా విద్యావ్యవస్థను కూడా మార్పు చేస్తూ చరిత్రలో పోరాడిన వారికి స్థానం లేకుండా వారికి అనుకూలమైన వారికి స్థానం కలిపిస్తున్నదని విమర్శించారు. మధ్య అసియానుండి వలస వచ్చిన వారే నిజమైన భారతీయులని చెప్తున్నారని కానీ దేశంలో వేల సంవత్సరాలకు పూర్వమే అభివద్ధి చెందిన హారప్ప,మొహంజోధారో సంస్కతి సంప్రదాయం సింధు నాగరికత ప్రాంతంలో విరసిల్లిందన్నారు.1922 సంవత్సరంలో పురావస్తు శాఖ తవ్వకాలలో బైట పడిందని గుర్తుచేశారు.దేశ మూలవాసులపైన ఆర్యులు దాడి చేసి చరిత్రను ధ్వంసం చేస్తే నేడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆర్యుల వారసత్వాన్ని కొనసాగిస్తూ ఈ దేశ ములవాసుల చరిత్రను కనుమరుగు చేస్తుందని తెలిపారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం అధ్యక్షత నిర్వహించిన ఈ స్టడీ సర్కిల్లో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్,జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, ఎండి పాషా,బండారు నర్సింహ, సిర్పంగి స్వామి, గుండు వెంకటనర్సు, గడ్డం వెంకటేష్,ఎంఎ ఇక్బాల్,బోలగాని జయరాములు,గంగాదేవి సైదులు,మాయ కష్ణ, మండల కార్యదర్శులు పోతరాజు జహంగీర్, బండారు శ్రీరాములు,ముత్యాలు,వడ్డేబోయిన వెంకటేశం పాల్గొన్నారు.