Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర మహాసభల ఆహ్వానసంఘం అధ్యక్షులు కల్లూరి మల్లేశం
నవతెలంగాణ- భువనగిరిరూరల్
ఈనెల30,31, జూన్1న జీఎంపీఎస్ రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయాలని ఉమ్మడి జిల్లా గొర్రెల పెంపకం దారుల సంఘం డైరెక్టర్,మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు కల్లూరి మల్లేశం పిలుపునిచ్చారు. మంగళవారం మండలం లోని తుక్కాపురం, న మత్పల్లి, నాగిరెడ్డిపల్లి, ఎర్రంబెల్లి గ్రామాల్లో మహాసభల కరపత్రాన్ని జిల్లా అధ్యక్షుడు దయ్యాల నర్సింహతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్బంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ గొర్రెల పెంపకందారుల సమస్యలపైన నిత్యం పోరాడే జీఎంపీఎస్ మహాసభల సందర్బంగా 30న జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. రెండో విడత గొర్రెల పంపిణీని తక్షణమే చేపట్టాలని,నేరుగా లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్ లో లోన్ జమచేయాలని,50ఏండ్లు దాటిన వారికి పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు దేవుని బాలయ్య, పాక జహంగీర్ , జిల్లా కమిటీ సభ్యులు పార్వతి దశరథ, ఎలముల వెంకటేశం, తుక్కాపురంఅధ్యక్షులు రాసాల శ్రీశైలం, నాగిరెడ్డిపల్లి అధ్యక్షులు కొత్త సత్తయ్య, నాయకులు తెల్జురి మల్లేశం,పుట్ట వీరేశ్ యాదవ్, దానయ్య, రాసాల కుమార్, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.