Authorization
Thu March 20, 2025 06:40:24 pm
- నా గెలుపు ప్రజలే దీవిస్తారు
- నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
నల్లగొండలో 20ఏండ్ల క్రితం చేయని అభివృద్ధి మూడేండ్లలో అభివద్ధి జరగ డంతో భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డ్డికి మతిభ్రమించి మాట్లాడుతున్నాడని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉండి ప్రజలకు పనులు చేయక నిర్లక్ష్యం చేశాడన్నారు. కాంగ్రెస్ హయాంలో కోమటిరెడ్డి ఐటీ మంత్రిగా ఉండి నల్లగొండ జిల్లాకు ఐటీ పరిశ్రమను తీసుకురాలేకపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వార్థం కోసం తమ షోరూమును కాపాడుకోవడానికి అవసరం లేని చోట చర్లపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుచేసి 18ప్రాణాలను బలిగొన్నాడని ఆరోపించారు . అవసరం ఉన్న చోట పానగల్లులో నిర్మించాల్సిన ఫ్లై ఓవర్ ను ఇందిరమ్మ విగ్రహం పెట్టి 38 ప్రాణాలను బలిగొన్నాడని అన్నారు. నల్లగొండ పట్టణంలో 550 కోట్లతో ఆధునిక రుణాలతో అభివద్ధి పనులు చేస్తున్నట్టు తెలిపారు.పట్టణంలోని ఓల్డ్ సిటీని పది మీటర్ల రోడ్డుతో మోడల్ సిటీగా తయారు చేస్తున్నట్టు పేర్కొన్నారు. గ్రామాలను పట్టణాలుగా మార్చి సమగ్ర అభివద్ధికి కషి చేస్తున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తన గెలుపు ప్రజలే దీవిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసమావేశంలో మున్సిపల్ చైర్మెన్ మందిడి సైదిరెడ్డి,వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ బొర్రా సుధాకర్, కనగల్ జెడ్పీటీసీ చెట్ల వెంకటేశం గౌడ్ , ఎంపీపీ కరీంపాష, నల్లగొండ, కనగల్ మండల అధ్యక్షులు దెప వెంకట్ రెడ్డి,యాదయ్యగౌడ్, పట్టణ అధ్యక్షుడు పిల్లీ రామరాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి బోనగిరి దేవేందర్, వివిధ వార్డుల కౌన్సిలర్లు ,తదితరులు పాల్గొన్నారు .