Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భువనగిరి:సమాజం లో నాలుగో ఫోర్త్ పిల్లర్ గా కొనసాగుతూ నిత్యం ప్రజా సమస్యల పట్ల కథనాలతో ప్రజలను చైతన్యవంతం చేస్తున్న జర్నలిస్టుల పై జరుగుతున్న దాడులను అరికట్టాలని తెలం గాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష-కార్యదర్శులు పెరబో యిన నర్సింహులు ,ముత్యాల జలంధర్ అన్నారు. మంగళవారం సూర్యాపేట లో వార్త దినపత్రిక ఉమ్మడి జిల్లా బ్యూరో ,కెమెరామెన్ పై జరిగిన దాడిని ఖండిస్తూ టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులపై దాడులు అధికమయ్యాయని అన్నారు. పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు నిత్యం అనేక వాస్తవాలను ప్రజలముందు ఉంచుతున్న పాత్రికేయులపై జరిగే దాడులను ప్రజాస్వామ్య వాదులంతా ముక్త కంఠం తో ఖండించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ భువనగిరి పార్లమెంట్ కన్వీనర్ అంతటి హరి ప్రసాద్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రావుల రాజు సంఘిభావం తెలిపారు. టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు నిమ్మల సురేష్ గౌడ్ బక్కన నర్సింహా పల్లెర్ల కుమార్,బొల్లెపల్లి కిషన్ పాల్గొన్నారు.