Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస రాష్ట్ర అద్యక్షుడు జి.నాగయ్య
నవతెలంగాణ -నల్లగొండ
పడవగా ఉన్నభూములను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సెద్యంలోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళ వారం నల్లగొండలోని దోడ్డి కొమరయ్య భవన్ లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఆఫీస్ బేరర్ సమావేశం బోజ్జ చిన వెంకులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రియల్ఎస్టేట్ పేరుతో లక్షలాది ఎకరాల సేద్యం భూములు ప్లాట్లు చేయడం వల్ల పడావుగా ఉన్నాయన్నారు. పంట సేద్యం తగ్గిందని, ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని తెలిపారు. సేద్యం చేయని రియల్ఎస్టేట్ భూములను భూమిలేని పేద రైతులకు కౌలుకు ప్రభుత్వమే ఇప్పించాలని కోరారు. ఇండ్లు లేని పేదలకు గత ప్రభుత్వాలు ఇండ్ల స్థలాలు ఇచ్చాయన్నారు. వారందరికీ డబుల్ బెడ్రుం ఇండ్లు నిర్మించి ఇవ్వకపోగా వాటిని ప్రభుత్వం పల్లె ప్రగతి, హరితహారం, గ్రామాభివృద్ధి పేరుతో గుంజుకుంటుందన్నారు. జూన్ నెలలోజరిగె భూ ఉద్యమంలో పేదలు పెద్దయెత్తున పాల్గొనాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లాప్రధాన కార్యదర్శి నారిఐలయ్య, ఆఫీస్ బేరర్స్ దండంపల్లి సరోజ, కంబాలపల్లి అనంద్, కత్తుల లింగస్వామి, కందుల సైదులు,అకుల వెంకట్ రాములు, చింతపల్లి లూర్ధుమారయ్య, తదితరులు పాల్గొన్నారు.