Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
50 ఏండ్లు నిండిన ప్రతి చేనేత కార్మికునికి రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ ఇవ్వాలని చేనేత కార్మికసంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గోశిక స్వామి డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా చేనేత కమిటీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన చేనేత భీమాను వయసు నిమిత్తం లేకుండా ప్రతి కార్మికునికీ వర్తింపజేయాలని డిమాండ్చేశారు.చేనేత కార్మికులకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు గుర్రం నర్సింహా, నాయకులు గంజి రామచంద్రం, గోశిక అంజయ్య, జెల్ల శ్రీనివాసులు, గణేశ్, సిలివేరు మార్కండేయ, రుద్ర యాదగిరి పాల్గొన్నారు.