Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివరాలు వెల్లడించిన డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి
నవ తెలంగాణ -నల్లగొండ
అదనపు కట్నం కోసం భర్త అత్త మామ వేధించడంతోనే తల్లీ, కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారని నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మతురాలు దొడ్డి కష్ణవేణి (లాస్య (23) నార్కట్‌పల్లి మండలం ఔరావాణి గ్రామానికి చెందిన దొడ్డి నరేశ్‌తో గతేడాది 26.02.2020 రోజున వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్నకానుకల కింద రూ.35 లక్షలు ఇచ్చారు. ప్రస్తుతం వారికి కుమారుడు సాత్విక్ 13 నెలల కుమారుడు ఉన్నాడు. మతురాలికి వివాహం అయిన నాటి నుండి భర్త దొడ్డి నరేశ్ , మామ దొడ్డి బీరయ్య అత్త దొడ్డి ఐలమ్మ అదనపు కట్నం తీసుకురమ్మని మానసికంగా , శారీరికంగా వేధిస్తున్నారు. ఆ బాధలు భరించలేక మతురాలు కష్ణ వేణి ఇంటిలో ఎవరు లేని సమయంలో ఈ నెల 22న సాయంత్రం 5 గంటలకు తన సీలింగ్ ఫ్యాన్ కు చీరతో తన కుమారుడు సాత్విక్ , ఆమె అదే చీరతో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మతురాలి తండ్రి గుడుగుంట్ల రామచంద్రం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో ఏసీపీఓ నల్లగొండ , శివరాం రెడ్డి , నార్కట్ పల్లి సీిఐ బి .రామకష్ణ , ఎస్ఐ ఎన్ . ధర్మ పాల్గొన్నారు.