Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకవీడు
మండలం మూసోడ్డు సింగారం గ్రామంలో సీసీరోడ్డు నిర్మాణపనులను ఎంపీపీ గోపాల్‌నాయక్, ఎంపీటీసీ దొంగల వెంకటయ్య, సర్పంచ్ బోయబోయిన వెంకటరమణ భిక్షంతో కలిసి ప్రారంభించారు.గ్రామంలోని రోడ్డును కలుపుతూ కంఠమహేశ్వర స్వామి ఆలయం వరకు మొత్తం320 మీటర్లు పొడవుకు ఎంపీపీనిధుల నుండి రూ.5లక్షలు,జెడ్పీటీసీ నిధుల నుండి రూ.5 లక్షలు, ఎంపీటీసీ నిధుల నుండి రూ.2 లక్షలు మొత్తం 12 లక్షలతో సీసీరోడ్డు వేస్తున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రావుల కోటయ్య, కాంగ్రెస్ మండలనాయకులు భూపాల్‌రెడ్డి,రాజబుడే, కంఠమహేశ్వరస్వామి ఆలయ కమిటీ చైర్మెన్ కందిమల్లసైదులు, పేరం నాగరాజు, చింతలచెర్వు కోటయ్య, మసిరాజు, సైదిరెడ్డి, చిత్తలూరి సైదులు, నకిరేకంటి జాను, వెంకన్న పాల్గొన్నారు.