Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్రిగూడ
14 రోజుల నుండి కడుపు చేత పట్టుకొని మండుటెండలో నిరసన చేస్తున్నా మాకు వారం కింద భూ నిర్వాసితులతో ధర్నా చేసినా పట్టించుకోకుండా మా పరిహారం ప్రభుత్వానికి పరిహాసంగా మారిందని చర్లగూడెం భూనిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు.మంగళవారం నాటికి ధర్నా 14 రోజులు చేరుకుంది.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత శనివారం నష్టపరిహారం చెక్కులు అందజేయమని కలెక్టర్ చెప్పారన్నారు.ఇచ్చిన గడువు పూర్తయి నాలుగు రోజులు గడుస్తున్నప్పటికి చెక్కుల ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు.ఇచ్చిన మాటను రాజకీయ నాయకులే కాదు.. ఉన్నత అధికారులు సైతం నిలబెట్టుకోలేకపోవడం గమనార్హమని వాపోయారు.ఈ కార్యక్రమంలో ఎరుకల నిరంజన్, కొండయ్య,శ్రీను, యాదయ్య పాల్గొన్నారు.