Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిలుకూరు
స్వచ్ఛభారత్ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయినా నేటి వరకు మరుగుదొడ్ల బిల్లులు రాలేదని, వెంటనే బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మండలంలోని జెర్రిపోతుల గూడెం గ్రామం లో పలువురు లబ్దిదారులు గ్రామ పంచాయతీ ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో మరుగుదొడ్ల నిర్మాణం చేసుకుంటే బిల్లులు మంజూరు చేస్తామన్నారు.నేటి వరకు బిల్లులు మంజూరు కాకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.ఈ విషయంపై గ్రామ పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ వీలైనంత త్వరలో బిల్లులు మంజూరుచేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో లబ్దిదారులు పాల్గొన్నారు.