Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరీక్షలను పరిశీలించిన విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటనర్సమ్మ
నవతెలంగాణ-మిర్యాలగూడ
పట్టణకేంద్రంలో నిర్వహించే ఎస్ఎస్సీ పరీక్షాకేంద్రాలను రాష్ట్ర పరిశీలకులు, విద్యా శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటనర్సమ్మ మంగళవారం పరిశీలించారు.సెట్ కాన్ఫరెన్స్ ద్వారా సిటింగ్ ఏర్పాట్లు, తరగతిగదిలో వసతులు, పరీక్షల నిర్వహణ, సెల్ఫోన్ల నిషేధం, ప్రశ్నాపత్రాల సీలింగ్ తదితర అంశాలపై చీప్ సూపరింటెండెండ్లకు పలు సూచనలు చేశారు.ముందుగా ప్రశ్నాపత్రాల స్టోరేజ్ పాయింట్‌ను పరిశీలించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇన్విజిలేటర్ విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న శోభారాణిని విధుల నుండి విడుదల చేశారు.పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సంతప్తి వ్యక్తం చేశారు.అదేవిధంగా రెవెన్యూ డివిజనల్ అధికారి రోహిత్‌సింగ్, తహసీల్దార్ గణేష్ కూడా పలు పరీక్షాకేంద్రాలను సందర్శించి సంతప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ బాలాజీనాయక్, పేపర్ కస్టోడియన్లు ఎం.తిరుపతి, గుడిపాటికోటయ్యసీఎస్, డీఓలు చాపల శ్రీనివాస్, గోపి, వెంకన్న, లక్ష్మణ్‌నాయక్, సైదులు, సైదిరెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్రీవెంకట్, శిరీష, విజయలక్ష్మీ,బ ఈమా పాల్గొన్నారు.