Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
ఇచ్చిన మాటను నిలబెట్టుకునే కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబమని పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు అన్నారు.మంగళవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులకు మూడెకరాల భూమి, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు లక్షలరూపాయలు రుణమాఫీ చేస్తామని తెలిపారు.టీఆర్ఎస్ రైతుల ఇబ్బందులను చూసి రాహుల్‌గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్‌లో పేర్కొన్న మాదిరిగా పంటలకు గిట్టుబాటుధర,భూమి ఉన్న రైతులతో పాటు కౌలురైతులకు కూడా ఏడాదికి ఎకరానికి రూ.15 వేలిస్తామని తెలిపారు. ధరణి పోర్టల్రద్దు, నకిలీ విత్తనాలు, పురుగుల మందుల విక్రయదారులుపై ఉక్కుపాదం మోపుతామన్నారు. కేసీఆర్ మాయ మాటలకు మోసపోకుండా రైతులు బుద్ధి చెప్పాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాజేశ్వర్ రావు, జ్ఞానసుందర్, వేములపల్లి వాసుదేవ రావు, ధరావత్ వీరన్ననాయక్, చింతమల్ల రమేష్, వెన్నమధుకర్రెడ్డి, సమీర్, అనిల్, వెంకన్న, భాష, వేణుధర్, అంజయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తాం
సూర్యాపేట:వరంగల్ రైతు డిక్లరేషన్‌ను రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి చేరే విధంగా కషి చేస్తున్నామని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు తెలిపారు. కాంగ్రెస్ జిలాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈనె 6న వరంగల్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాహుల్‌గాంధీ ప్రకటించిన డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ కషి చేయాలని కోరారు.కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో టీిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు, వ్యవసాయానికి ఒరగబెట్టిందేమీ లేదన్నారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు పేద, బడుగు, బలహీన వర్గాలకు, భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వ భూముల పట్టాలిస్తే, నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని లాక్కుంటుందని ఆరోపించారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర అధికారప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, పట్టణఅధ్యక్షుడు అంజద్‌అలీ, రాష్ట్ర నాయకులు అన్నెపర్తి జ్ఞానసుందర్, వార్డు కౌన్సిలర్ కక్కిరేణిశ్రీనివాస్, ఆలేటిమాణిక్యం, కుందమళ్ళ శేఖర్, తంగెళ్ళ కర్నాకర్‌రెడ్డి పాల్గొన్నారు.